Skip to main content

Prakash at Teachersbadi.in | ప్రకాశ్ @ టీచర్స్ బడి.ఇన్

ప్రత్యేక వార్తా కథనం

ప్రకాశ్ @ టీచర్స్ బడి.ఇన్

అభిరుచితో ఆన్‌లైన్‌లో రాణిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రకాశ్ @ టీచర్స్ బడి.ఇన్ — వార్తా కథనం
“ప్రకాశ్ @ టీచర్స్ బడి.ఇన్” — వార్తా కథనం
💻 అభిరుచితో ఆన్‌లైన్‌లో రాణిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
📚 ఉద్యోగ, నిరుద్యోగులకు విలువైన సమాచారం
👥 నిత్యం వేలాది మంది వీక్షకులు
🏆 ఆదర్శంగా నిలుస్తున్న వేముల ప్రకాశ్
మంచితనంతో కూడిన ఆలోచనకు అభిరుచి, ఆసక్తి, పట్టుదలను జత చేసి పదిమందిలో ప్రత్యేకత సాధించవచ్చని నిరూపించారు తొర్రూరు వాసి వేముల ప్రకాశ్. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన ‘టీచర్స్ బడి డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌ను నెలకొల్పి ఎంతో మంది ఉద్యోగ, నిరుద్యోగులకు తాజా సమాచారాలను అందిస్తున్నారు.

అభిరుచితో ఆన్‌లైన్‌లో రాణిస్తూ...

మంచితనంతో కూడిన ఆలోచనకు అభిరుచి, ఆసక్తి, పట్టుదలను జత చేసి పదిమందిలో ప్రత్యేకత సాధించవచ్చని నిరూపించారు తొర్రూరు వాసి వేముల ప్రకాశ్.

వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన ‘టీచర్స్ బడి డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌ను నెలకొల్పి ఎంతో మంది ఉద్యోగ, నిరుద్యోగులకు తాజా సమాచారాలను అందిస్తున్నారు.

నాణ్యమైన సమాచారం లభిస్తుండటంతో వెబ్‌సైట్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య వేలల్లో ఉంటోంది.

Google Search Conferenceలో ప్రత్యేక గుర్తింపు

16 జులై 2018న హైదరాబాద్‌లో జరిగిన Google Search Conferenceలో మహబూబాబాద్ జిల్లా నుంచి ఎంపికైన మొదటి వ్యక్తిగా వేముల ప్రకాశ్ నిలిచారు.

కాన్ఫరెన్స్‌లో కంటెంట్‌ను పెంచుకోవడానికి సెర్చ్ ఇంజిన్‌ను ఎలా వాడుకోవాలో Google నిర్వాహకులకు సూచించి మన్ననలు పొందారు.

కేవలం డిగ్రీ విద్యతో సాంకేతికతపై పట్టు పెంచుకుంటూ విజయపథంలో ముందుకు వెళ్తున్న ప్రకాశ్‌పై ఈ కథనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది.

విద్యాభ్యాసం నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకు

వేముల ప్రకాశ్ పెద్దవంగర మండలం, ఔతాపురం గ్రామానికి చెందినవారు. ఏడో తరగతి వరకు అక్కడే చదివి, పదవ తరగతి రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్ తొర్రూరు జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఏబీవీ కళాశాల, జనగామలో, టీటీసీ హన్మకొండలో, బీఈడీ సిద్దిపేటలో పూర్తి చేశారు.

2002 డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. చదివింది డిగ్రీ అయినప్పటికీ కొత్త సాంకేతిక అంశాలపై ఆసక్తి కనబర్చేవారు.

సాంకేతికతపై ఆసక్తి

ఆసక్తి, ఉత్సాహం, కొత్తగా ఏదో చేయాలనే కసి, తపన, కష్టపడే మనస్తత్వం ద్వారా చదువుకునే రోజుల్లోనే టీవీ మెకానిజం తండ్రి నుంచి నేర్చుకొని ఆయనకు చేదోడువాదోడుగా నిలిచేవారు.

ఈ క్రమంలోనే ఎస్జీటీగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తర్వాత ఇంటర్నెట్‌పై దృష్టి సారించారు.

టీచర్స్ బడి.ఇన్ ఆవిర్భావం

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో 2012లో ప్రమాదవశాత్తు ఆయన కుడి కాలు విరిగింది. డాక్టర్లు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో ఇంటి వద్ద ఖాళీగా కూర్చున్న సమయంలో ఇంటర్నెట్ పరిజ్ఞానంపై పట్టు సాధించారు. ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులను పరిశీలించారు.

ఉపాధ్యాయులకు, నిరుద్యోగ యువతకు ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సరళంగా అందించాలనే ఆలోచనతో సొంతంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నారు.

2 జూన్ 2013న ‘టీచర్స్ బడి.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించి అధికారికంగా .in డొమైన్‌ను కొనుగోలు చేసి వెబ్‌సైట్‌కు నామకరణం చేశారు.

టీచర్స్ బడి వెబ్‌సైట్ ద్వారా సేవలు

  • ఉద్యోగ నోటిఫికేషన్లు
  • పోటీ పరీక్షల వివరాలు
  • విద్యాశాఖ నుంచి వెలువడిన మార్గదర్శకాలు
  • ఉత్తర్వులు మరియు ప్రభుత్వ జీవోలు
  • వేతన పంపిణీ, విడుదల సమాచారాలు
  • ఉద్యోగులకు సంబంధించిన వేతన వివరాలు
  • జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి వివరాలు
  • విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు
  • పోటీ పరీక్షల వివరాలు
  • వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారం

డిజిటల్ యుగానికి అనుగుణంగా సేవలు

నేటి సాంకేతిక యుగంలో వేలాది మంది Android స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తుండటం, నెట్ సౌకర్యం ఉండటం వల్ల తాజా సమాచారాన్ని సోషల్ నెట్‌వర్క్స్ నుంచి పొందే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు.

వెబ్‌సైట్‌లో ఉన్న అంశాలకు సంబంధించిన సందేహాలు, సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్సులను వినియోగించుకునేలా సౌకర్యాన్ని కల్పించారు.

తక్షణ సమాచారం కోసం ఇతరులకు పంపేందుకు సోషల్ నెట్‌వర్క్‌లో ఇన్‌బాక్స్‌లో షేర్ బటన్‌ను రూపొందించారు. దీని ద్వారా సెకన్లలో సమాచారం పొంది ఇతరులకు చేరవేసే విధంగా ఏర్పాటు చేశారు.

అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని పంచే ప్రయత్నం

ఎవరి వద్దనైనా అందరికీ ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ లేదా అప్లికేషన్ పాఠాలు ఉంటే వాటిని వెంటనే వెబ్‌సైట్‌లో రూపొందిస్తానని తెలిపారు.

అలాంటి సమాచారాన్ని ‘టీచర్స్ బడి.ఇన్’ మెయిల్‌కు పంపితే అందరికీ అందుబాటులో ఉంచుతానని ఆయన పేర్కొన్నారు.

“
ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే సాంకేతికతను ఉపయోగించుకుని సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అందించాలనే ఆలోచనతో ముందుకు సాగడం ప్రత్యేకత.
— వేముల ప్రకాశ్
మూలం: అందుబాటులో ఉన్న వార్తా కథనం PDF